వైఎస్సార్సీపీ నాయకులకు ఛాలెంజ్ విసిరిన శివదత్ బోడపాటి

పాయకరావుపేట నియోజకవర్గం, అమలాపురం పంచాయతీ, మూలపర్ర గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే గొల్లబాబురావు అనుచరుల అవినీతి అతిదారుణంగా వుంది. 61 మంది లబ్ధిదారులకు ఇల్లు స్థలం కేటాయిస్తే ఇప్పటికి మూడు సంవత్సరాల నుంచి ఒక్క ఇటుక, ఒక్క లబ్ధిదారుడు నుంచి కూడా ఇక్కడ పడలేదు. ఇదే విషయం గురించి పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తున్నారు, దీనికెందుకు వైఎస్సార్సీపీ పార్టీకి ఇంత భయం.. మీకు చేతనైతే అవినీతి లేదని నిరూపించండి అని జనసేన పార్టీ స్టేట్ సెక్రటరీ శివదత్ బోడపాటి జనసేన పార్టీ తరపున ఛాలెంజ్ విసిరారు. ఈ కార్యక్రమంలో నర్సింగరావు (గబ్బర్ సింగ్), కురందాసు అప్పలరాజు, శ్రీను, పిక్కి స్వామి, అల్లాడ రమణ, రాజు బంగారి తదితరులు పాల్గొన్నారు.