చంద్రబాబు విడుదలను కోరుతూ శ్రీ లక్ష్మీనరసింహస్వామి సుదర్శన యాగం

  • శ్రీ లక్ష్మీనరసింహస్వామి సుదర్శన యాగంనకు హాజరైన జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు

మంగళగిరి నియోజకవర్గం: మంగళగిరి మండలం, చిన్నకాకాని, హైలాండ్ సమీపంలో ఉన్న జుపిటర్ అపార్ట్మెంట్స్ లో మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆరోగ్యం బాగుండాలని మరియు జైలు నుంచి త్వరగా బయటికి రావాలని అపార్ట్మెంట్ వాసులు ఆదివారం శ్రీ లక్ష్మీనరసింహస్వామి సుదర్శన యాగం ఉదయం నిర్వహించడం జరిగింది. శ్రీ లక్ష్మీనరసింహస్వామి సుదర్శన యాగానికి అపార్ట్మెంట్ వాసులు మరియు తెలుగుదేశం పార్టీ నాయకుల ఆహ్వానం మేరకు జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు మరియు గుంటూరు జిల్లా సంయుక్త కార్యదర్శి బడే కోమలి, ఎంటిఎంసీ అధ్యక్షులు మునగపాటి వెంకట మారుతీరావు, చేనేత విభాగం రాష్ట్ర కార్యదర్శి జంజనం వెంకట సాంబశివరావు (జే ఎస్ ఆర్)పాల్గొనడం జరిగింది. అనంతరం మీడియాతో చిల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ అపార్ట్మెంట్ వాసులు మరియు తెలుగుదేశం పార్టీ నాయకుల ఆహ్వానం మేరకు ఈ రోజున నిర్వహించిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి సుదర్శన యాగంలో మా పార్టీ నాయకులతో కలిసి పాల్గొనడం జరిగిందని, అలాగే ఒక నిరాధారమైన కేసులో చంద్రబాబు గారిని అక్రమంగా అరెస్టు చేశారని, ఒక్క అవకాశం అంటూ ప్రజలను వేడుకుని అధికారంలోకి వచ్చిన జగన్‌రెడ్డి.. నాలుగేళ్లలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారన్నారు. కూల్చివేతలు, ప్రతిపక్షాలపై వేధింపులు, కక్ష సాధింపులు, అక్రమ కేసులు తప్ప వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదని విమర్శించారు. పోలీస్ వ్యవస్థను తన అధినంలో పెట్టుకొని జగన్ రాష్ట్రంలో విధ్వంసలు సృష్టిస్తున్నారన్నారు. ప్రతిపక్షాలపై అక్రమ కేసులు పెట్టి భయపెట్టడం వంటి కార్యక్రమాలకే నాలుగున్నరేళ్ల సమయం సరిపోయిందన్నారు. వచ్చే ఎన్నికలలో జగన్ కు పతిపక్షం హోదా కూడా రాకుండా చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడేందుకు టీడీపీతో కలిసి జనసేన పనిచేస్తుందని తెలిపారు.