ఆయోధ్య రాముని భూమి పూజకు వెండి ఇటుకలు

అయోధ్య‌లో రామాల‌య నిర్మాణానికి ఆగస్టు 5న శంకుస్థాప‌న చేయనున్న ప్రధాని మోడి. అయితే… నగరమంతా భారీ స్క్రీన్లను ఏర్పాటు చేసి ఆ స్క్రీన్ల ద్వారా భక్తులు భూమి పూజను వీక్షించే ఏర్పాట్లుజరుగుతున్నాయి. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అధ్యక్షుడు నృత్య గోపాల్ దాస్ ఈ సందర్భంగా మాట్లడుతూ… భూమి పూజ కోసం ఐదు వెండి ఇటుక‌ల‌ను సిద్ధం చేసినట్లు తెలిపారు. ఈకార్యక్రమానికి మూడు రోజుల ముందు నుంచి వేద శాస్త్రాలను అనుసరించి క్రతువులు ఉంటాయని తెలిపారు. ప్రధాని మోడిని కార్యక్రమానికి ఆహ్వానించామని, అయితే… ఆయన ఏ రోజు వస్తారనే విషయాన్ని ప్రధాని కార్యాలయం నుండి ఇంకా సమాచారం రావలసి ఉందని చెప్పారు. కాకపోతే, 5వ తేదీన వస్తున్నట్లు తమకు సమాచారం ఉందని తెలిపారు.

ఈ కార్యక్రమానికి ఆహ్వానిoచిన సీనియర్ బిజెపి నేతలందరికీ అయోధ్యోద్యమంతో సంబంధం ఉన్నట్లు ట్రస్ట్ పేర్కొంది. అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమా భారతి, వినయ్ కతియార్, సాధ్వి రీతంభర తదితరులందరికి ఆహ్వానం అందినట్లు ప్రకటించింది. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మరియు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారని పేర్కొంది.