దేశవ్యాప్తంగా ఏకకాలంలో 100 చోట్ల సీబీఐ దాడులు..

ఈరోజు దేశవ్యాప్తంగా సీబీఐ వంద చోట్ల ఏక కాలంలో సోదాలు జరపడం సంచలనంగా మారింది. దేశం మొత్తం మీద 11 రాష్ట్రాల్లో 100 చోట్ల ఏక కాలంలో సీబీఐ సోదాలు జరిప్పింది. సుమారు 3700 కోట్ల రూపాయలకు పైగా బ్యాంకులని మోసగించిన వ్యవహారంలో మొత్తం దేశవ్యాప్తంగా 30 కేసులు నమోదయ్యాయి.

తెలుగు రాష్ట్రాల్లో కూడా హైదరాబాద్, విశాఖపట్నం, గుంటూరులో సోదాలు జరపగా అక్కడ కొన్ని పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా వివిధ జాతీయం చేసిన బ్యాంకుల నుండి ఫిర్యాదులు వచ్చిన తర్వాత సీబీఐ ఈ సోదాలు చేపట్టినట్టు చెబుతున్నారు. ఫిర్యాదుదారులలో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐడిబిఐ, కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ మరియు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉన్నాయి.