అవినీతి కి అడ్డాగా మారిన సింగరాయకొండ గ్రామపంచాయతీ

ప్రకాశం జిల్లా, కొండేపి నియోజకవర్గం, సింగరాయకొండ మండలం, సింగరాయకొండ గ్రామపంచాయతీ కార్యాలయం కు సంబంధించి నిరుపయోగంలో ఉన్న పాత ఇనుప సామాన్లు ప్రజాశక్తి పేపర్ నందు మంగళవారం ప్రచురించడం జరిగింది. దీనిలో భాగంగా సింగరాయకొండ మండలం ఈవోపీఆర్డి ని కలిసి సింగరాయకొండ గ్రామపంచాయతీలో పాత ఇనుప సామాన్లు 140 కేజీలు, పాత పేపర్ దినపత్రికలు 100 కేజీలు, పాత ట్యూబ్ లైట్ సెట్స్ 50, పాత అల్యూమినియం డిస్కులు 50, అని ఏ విధంగా పేపర్ ప్రకటన మీరు ఇచ్చారని ఈఓపిఆర్డి నీ జనసేన పార్టీ నాయకులు వివరణ అడగడం జరిగింది. ఈ విషయం పై ఈఓపిఆర్డి, సింగరాయకొండ గ్రామపంచాయతీ కార్యదర్శికి ఫోన్ చేసి అడుగగా నాకు కూడా తెలియదు అని గతంలో తీసుకొచ్చిన టెండర్ ని ఇప్పుడు అమలుపరుస్తున్నాం. సింగరాయకొండ గ్రామపంచాయతీ కి సంబంధించిన పాత సామాన్లు కూడా చాలా ఉన్నాయి అని చెప్పడం జరిగినది. సుమారు నాలుగు సంవత్సరాల క్రితం సింగరాయకొండ గ్రామపంచాయతీలో టెండర్ వేయడం జరిగింది. మరి నాలుగు సంవత్సరాలు లోపల ఉన్నటువంటి పాత ఇనుప సామాన్లు 140 కేజీలైన, 50 డిస్కులేనా, 50 ట్యూబ్ లైట్ సెట్ లేనా, 100 కేజీల న్యూస్ పేపర్ లేనా, మిగిలినవన్నీ మరిఎవరు దోచుకుపోయారని, సింగరాయకొండ గ్రామ ప్రజలు వారి అవేదన వ్యక్తం చేస్తున్నారు. విషయం పై జనసేన పార్టీ సింగరాయకొండ మండల ఈఓపిఆర్డికి వినతిపత్రం అందజేసి, దీనిపై ప్రత్యేక అధికారిని వేసి విచారణ చేపట్టి జరిగిన అవినీతి బయటకు తీసి తర్వాత మాత్రమే టెండర్ వేయమని విజ్ఞప్తి చేయడమైనది.