రామరాజుకి జోడీగా సీత వచ్చింది

ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ చిత్రం చిత్రీకరణ శరవేగంగా జరుగుతుంది. లాక్డౌన్ కారణంగా ఎనిమిది నెలల పాటు ఆగిపోయిన షూటింగ్, మళ్ళీ మొదలయ్యి రీసెంట్‌గా రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం మరో షెడ్యూల్ మొదలవుతుంది. ఈ షెడ్యూల్ లో ఆలియా భట్ కూడా పాల్గొననుంది. ఈ మేరకు ఆలియా భట్ హైదరాబాద్ చేరుకుంది. ఎయిర్ పోర్టులో ఆలియా దిగిన ఫోటోలు వైరల్ కావడంతో ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ నిమిత్తమే వచ్చిందని ప్రచారం చేసారు.

అయితే తాజాగా ఆలియా భట్, రాజమౌళిని కలిసిన ఫోటోని ఆర్ ఆర్ ఆర్ చిత్రబృందం షేర్ చేసింది. ఆలియాకి స్వాగతం చెబుతూ ట్వీట్ చేసింది. ఆర్ ఆర్ ఆర్ లో అల్లూరి సీతారామరాజుగా కనిపిస్తున్న రామ్ చరణ్ కి జోడీగా సీత పాత్రలో ఆలియా నటిస్తుంది. నేటినుండి మహాబలేశ్వరంలో షూటింగ్ జరుపుకోనుంది. చిత్రంలో సీత పాత్ర పోషిస్తున్న అలియా భట్ టీంతో కలిసింది. రామ్ చరణ్‌, అలియాపై జక్కన్న కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నట్టు తెలుస్తుంది. చారిత్రక నేపథ్యంలో రూపొందిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు.