‘నీలాంబరి’ ఫుల్‌ లిరికల్‌ సాంగ్‌ @ ఆచార్య

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్నారు. చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్, చరణ్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదల అయిన లుక్స్, టీజర్ అని ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

కాగా దీపావళి కానుకగా ఈ మూవీ నుంచి సెకండ్‌ సింగిల్‌ ప్రోమోను నిన్న రిలీజ్ చేయగా, ఫుల్‌ లిరికల్‌ సాంగ్‌ ని ఈ రోజు రిలీజ్ చేశారు. దీనితో పాటు సాంగ్‌ మేకింగ్‌ సీన్స్‌తో వీడియోను వదిలారు. ‘నీలాంబరి .. నీలాంబరి .. వేరెవ్వరే నీలామరి, అయ్యోరింటి సుందరి .. వయ్యారాల వల్లరి .. నీలాంబరి అంటూ సాగే ఈ పాట‌లో రామ్ చ‌ర‌ణ్ త‌న డ్యాన్స్‌తో ఆక‌ట్టుకున్నాడు. పూజ లుక్స్ బాగున్నాయి.