నయన్ కోసం శివన్‌ ఎమోషనల్‌ పోస్టు

దక్షిణాది అగ్ర కథానాయిక నయనతార పుట్టిన రోజు సందర్భంగా సినీ పరిశ్రమ, అభిమానులు ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ క్రమంలో నయనతార ప్రియుడు, దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌ తన ప్రేయసి నయన్‌కు బర్త్ డే విషెష్‌ చెప్పాడు. నయన్‌ ఫోటోలను సోషల్‌ మీడియా పోస్టు చేస్తూ.. “హ్యపీ బర్త్‌ డే బంగారం.. నువ్వు ఎల్లప్పుడూ అదే స్పూర్తినిస్తూ, అంకితభావంతో నిజాయితీ గా ఉండు. దేవుడు ఎల్లప్పుడూ నిన్ను సంతోషం, విజయాలతో ఆశీర్వదిస్తాడు. పాజిటివిటీ, అద్భుతమైన క్షణాలతో ఎంజాయ్‌ చేయాలి” అంటూ ఎమోషనల్‌ పోస్ట్‌ చేశాడు.