తెరుచుకోనున్న సాలార్ జంగ్ మ్యూజియం

కరోనా అన్‌లాక్ ప్రక్రియ మొదలు కావడంతో టూరిజం కేంద్రాలు దేశ వ్యాప్తగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ఈ నెల 10వ తేదీన తిరిగి సాలార్‌జంగ్ మ్యూజియం కూడా తెరుచుకోనుంది. కొవిడ్ వైరస్ కారణంగా విధించిన లాక్‌డౌన్ సమయం నుండి సాలార్‌జంగ్ మ్యూజియం మూసివేయబడింది. సందర్శకులకు ప్రవేశ ద్వారంలో థర్మల్ స్ర్కీనింగ్‌ను నిర్వహించనున్నట్లు నిర్వాహాకులు మ్యూజియం అధికారులు తెలిపారు.

పర్యాటకులు ఫేస్ కవర్, మాస్కులను తప్పనిసరిగా ధరించాలని సూచించారు. సందర్శన సమయంలో సోషల్ డిస్టెన్స్ పాటించాలన్నారు. కాగా వృద్ధులు, గర్భిణీలు, చిన్నపిల్లలు, శిశువులకు అనుమతి లేదని తెలిపారు.