మేడారం భక్తులకు మాస్కులు పంపిణీ చేసిన జనసైనికులు

స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో మేడారం వెళ్తున్న భక్తులకు, సిబ్బందికి డివిజన్ కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ లో జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు గాదె పృథ్వి ఆధ్వర్యంలో జనసైనికులు మాస్కులు పంపిణీ చేసారు. అధినేత పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం వెళ్లే ప్రయాణికులకు మాస్కులు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మునిగెల పవన్ , మహమ్మద్ రజాక్, రోహిత్, బషీర్, విజయ్ చింటూ తదితరులు.