తొలి మహిళా ఉపాధ్యాయురాలుకు జనసేన ఆధ్వర్యంలో ఘన నివాళి

భారతదేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలు ప్రముఖ సంఘ సేవకురాలు క్రాంతి జ్యోతి శ్రీమతి సావిత్రిబాయి పూలే 191వ జయంతి సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి సంపతి సత్యనారాయణ మూర్తి ఆధ్వర్యంలో ద్రాక్షారామం మెయిన్ రోడ్ లో ఉన్న జ్యోతిరావు పూలే, సావిత్రి బాయిపూలే విగ్రహాలకు రామచంద్రపురం నియోజవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ పోలిశెట్టి చంద్రశేఖర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు . ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శులు బుంగా రాజు, రామచంద్రపురం రూరల్ అధ్యక్షులు పోతాబత్తుల విజయ్ కుమార్, ఉపాధ్యక్షులు గుబ్బల శ్రీను, వెంకటాయపాలెం MPTC కణితి వెంకటేశ్వరి (w/oకణితి రాంబాబు)వీరుబండి, కర్రా నాగేశ్వరరావు, దొరబాబు , గాలి రాము, రాంబాబు నాయుడు, దుళ్ళ కొండ, గండేటి శివ, దేవుడు, తదితర ద్రాక్షారామం గ్రామ జనసైనికులు పాల్గొనడం జరిగింది.