వివోఏల సమ్మెకు జనసేన సంఘీభావం

భద్రాద్రి కొత్తగూడెం, జిల్లా ములకలపల్లి మండలంలొ గత 28 రోజులుగా వివోఏల నిరువధిక సమ్మె నిర్వహించడం జరుగుతుంది. ఈ సమ్మెను పురస్కరించుకొని 15-05-2023న ములకలపల్లి మండల కేంద్రంలో వివోఏల ఆధ్వర్యంలో అఖిలపక్ష పార్టీల సమక్షంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశంలో వివోఏలకు జనసేన పార్టీ నాయకులు సంఘీభావం తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లా యువజన విభాగ సెక్రెటరీ గరికే రాంబాబు మరియు జనసేన పార్టీ ములకలపల్లి మండల అధ్యక్షుడు తాటికొండ ప్రవీణ్ మాట్లాడుతూ వివోఏ లకు రోజువారి కూలీల లెక్కేస్తే రోజుకి 150 రూపాయలు మాత్రమే వస్తుందని ఇతర కూలి పనులకు పోయే వారికి 500, 600 రూపాయలు వస్తాయని మరి వీరికి ఈ 150 రూపాయలతో ఇల్లు గడవడం ఎంత ఇబ్బంది అవుతుందో ఆలోచించమని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించడం జరిగింది. మరియు వీరి డిమాండ్స్ కనీస వేతనం 26,000 ఇవ్వాలని వివోఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని పిఏఎఫ్ ఇన్సూరెన్స్ హెల్త్ కార్డులు ఐడి కార్డులు టిఏలు డిఏలు ఇవ్వాలి. మరియు యూనిఫార్మ్స్ స్టేషన్ ఎలివేన్స్ ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగింది. వీరు అడిగినవన్నీ న్యాయ పరమైన డిమాండ్స్ అని వీరి సమస్యలను గుర్తించి పరిష్కరించని పక్షంలో వివోఏలు చేసే ప్రతి పోరాటంలో జనసేన పార్టీ అండగా ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ములకలపల్లి మండల కార్యదర్శి బాణావత్ రవికుమార్ జగన్నాధపురం గ్రామ కమిటీ నాయకులు కుంజ పాపారావు పుసుగూడెం గ్రామ కమిటీ నాయకులు బోడ నాగరాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు.