భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించండి

  • సత్తెనపల్లిలో కదం తొక్కిన కార్మికులు
  • భవన నిర్మాణ కార్మికులకు మద్దతు తెలిపిన జనసేన
  • అంబటి పిఏకి విజ్ఞాపన పత్రం సమర్పణ

సత్తెనపల్లి నియోజకవర్గం: గత నాలుగున్నరేళ్ళుగా అపరిషృతంగా ఉన్న భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, కార్మికుల పాలిట శరాఘాతంగా మారిన 1214 మెమోను ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకుని తమ క్లైములను పరిష్కరించాలంటూ శుక్రవారం కార్మికులు సత్తెనపల్లిలో కదం తొక్కారు. ఈ కార్యక్రమంలో ముండుగా గార్లపాడు బస్టాడ్ సెంటర్ లో కార్మికులను ఉధ్ధేశించి కార్మిక, రాజకీయ నాయకులు ప్రసంగించారు. జనసేన పార్టీ ఈ పోరాటానికి తమ పూర్తి మద్దతుని తెలిపింది. ఆ పార్టీ నాయకులు బొర్రా వెంకట అప్పారావు, కొమ్మిశెట్టి వెంకట సాంబశివరావులు ప్రసంగించారు. అనంతరం పట్టణ వీధుల్లో భారీగా ర్యాలీ నిర్వహించి స్థానిక ఎమ్మెల్యే, మంత్రి అంబటి రాంబాబు నివాసానికి వెళ్ళి ఈ మేరకు మహాజరును సమర్పించారు. రెండు నెలల్లో కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, అందుకొరకు అసెంబ్లీలో, మంత్రివర్గ సమావేశాల్లో తమ సమస్యల్ని ప్రస్తావించాలన్న డిమాండ్లుతో వెళ్ళిన కార్మికులు అంబటి లేకపోవడంతో అతని పి.ఏకి విజ్ఞాపన పత్రాన్ని ఇచ్చి రెండు నెలల తర్వాత భారీగా ఆందోళనలు చేపడతామని అల్టిమేటం జారీ చేశారు. అప్పటి వరకు ఉన్న మంత్రి అంబటి గుంటూరుకి వెళ్ళిపోవడంతో “స్థానికేతరులు ప్రజాప్రతినిధులైతే ఇలాగే ఉంటుంద”ని నిరాశతో వెనుదిరిగారు. చివరిగా పుతుంబాక వెంకటపతి భవన్ లో ఏర్పాటు చేసిన భోజన కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు భవన నిర్మాణ కార్మికులతో కలిసి సహ-పంక్తి భోజనాలు చేయడం జరిగింది.