గిరిజనుల సమస్యలను పరిష్కరించండి!: జనసేన డిమాండ్

సరేపల్లి నియోజకవర్గం, ముత్తుకూరు మండలంలో జనసేన నాయకులు పలు ప్రాంతాలలో పర్యటించి అక్కడి గిరిజనుల సమస్యలు తెలుసుకోవడం జరిగింది. ఆదాల నగర్ బిట్టు-1 లో 10 గిరిజన కుటుంబాలు గుడిసెలు వేసుకొని నివాసముంటున్నారు. ఆ 10 కుటుంబాల్లో 8 కుటుంబాలకి ఉండటానికి ఇల్లు లేదు.. అకాల వర్షం వస్తే ఆ వర్షంలోనే ఆ గుడిసెల్లోనే పసిబిడ్డలను పెట్టుకొని గడిపే పరిస్థితి. కనీసం ఆధార్ కార్డు, రేషన్ కార్డు గాని లేదు మరి అక్కడ ఉన్నటువంటి వాలంటరీ వ్యవస్థ ఇప్పటివరకు వాళ్ల గురించి పట్టించుకోక పోవడం చాలా బాధాకరమైన విషయం. అయితే వాళ్లు ప్రతి నెల 20 రూపాయలు పెట్టి రేషన్ బియ్యం కొనుక్కొని తింటున్నారు అంటే ఎంత దారుణంగా ఉందో దీనిని బట్టి తెలుస్తుంది. అయితే ఆ 10 కుటుంబాలలో 8 కుటుంబాలకి ప్రతి నెలా బియ్యం అందిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వాళ్లకి ఎవరైతే ఇక్కడ వాలంటీరుగా పని చేస్తున్నారో వాళ్ళు త్వరితగతిన రేషన్ కార్డు ఆధార్ కార్డు ఏర్పాటు చేయాలి. అలా చేయని పక్షంలో మేము దగ్గరుండి వాళ్ళకి రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఇప్పించే అంత వరకు ప్రభుత్వం అధికారుల చుట్టూ తిరగడానికి మేము సిద్ధం. అదేవిధంగా ఏదైతే ముత్తుకూరు మండలం లోని అధికార పార్టీ నాయకులు, అధికారులకు గిరిజనుల సమస్యల పట్టవా.. ఇదేనా అభివృద్ధి అంటే? దయచేసి గిరిజనుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో స్థానికులు రహీం భాయ్, పవన్, వీరబాబు, సందీప్, రవి కుమార్, శ్రీహరి, గిరీష్, రహమాన్ తదితరులు పాల్గొన్నారు.