మరికొంత కాలం సోనియానే..

కాంగ్రెస్‌ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా ఇంకా కొంత కాలం పాటు సోనియా గాంధీనే కొనసాగనున్నారు. సీడబ్ల్యూసీ భేటీలో సుదీర్ఘ సమయం పాటు చర్చించిన నేతలు పార్టీ సారథ్య బాధ్యతలు ఎవరికి ఇవ్వాలనే అంశంపై చర్చించారు. ఎక్కువ మంది నేతలు సోనియానే కొనసాగాలనీ.. అనారోగ్య సమస్యలు ఉంటే ఆ బాధ్యతలు రాహుల్‌కి అప్పగించాలని కోరినట్టు తెలుస్తోంది. నాటకీయ పరిణామాల మధ్య కొనసాగిన ఈ సీడబ్ల్యూసీ భేటీలో మళ్లీ సోనియాగాంధీనే తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగేలా నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.