మంత్రి కేటీఆర్ ను కలిసిన సోనూ సూద్

ప్రముఖ నటుడు సోనూ సూద్ ఇవాళ హైదరాబాద్ విచ్చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తో భేటీ అయ్యారు. ప్రగతి భవన్ లో జరిగిన ఈ సమావేశంలో పలువురు టాలీవుడ్ ప్రముఖులు, మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ నవీన్ తదితరులు పాల్గొన్నారు. కరోనా సమయంలో సోనూ సూద్ చేపట్టిన దాతృత్వ సేవలను ఈ సందర్భంగా కేటీఆర్ కొనియాడారు. సోనూ సూద్ కు శాలువా కప్పి, జ్ఞాపికను బహూకరించారు. ఈ సమావేశంలో తెలంగాణలో వైద్య ఆరోగ్య మౌలిక సదుపాయాల వికేంద్రీకరణ అంశం చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది.