ఆస్పత్రి నుంచి సౌరవ్‌ గంగూలీ డిశ్చార్జ్

కొద్ది రోజుల క్రితం స్వల్ప గుండెనొప్పితో వుడ్‌ల్యాండ్‌ హాస్పిటల్‌లో చేరిన బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ గురువారం ఆసుపత్రి నుంచి డిశ్చార్చి అయ్యారు. హాస్పిటల్‌ ప్రాంగణంలో ఇంటికి వెళ్తున్న క్రమంలో మీడియాతో మాట్లాడారు. తన ఆరోగ్యంగా పూర్తిగా బాగుందన్నారు. ఈ సందర్భంగా తనకు వైద్యసేవలందించి డాక్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఏడు రోజుల కిందట హాస్పిటల్‌కు చేరిన గంగూలీకి గుండెలోని రక్తనాళాలు రెండు చోట్ల మూసుకుపోవడంతో యాంజియోప్లాస్టీ చేశారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉండడంతో హాస్పిటల్‌ నుంచి వైద్యులు డిశ్చార్జి చేశారు. కొద్ది రోజులు ఆరోగ్య పరిస్థితిని గంగూలీ నివాసంలోనే వైద్యులు సమీక్షించనున్నారు.