తక్షణమే ఎస్పీ ట్రాన్స్ఫర్ ఆర్డర్ ను రద్దు చేయ్యలి – జనసేన, టీడిపి

తిరుపతి జిల్లాకు కొత్త ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన మల్లికా గర్గ్ మూడు వారాలు కూడా పూర్తి కాకముందే ఆమెను అధికార పార్టీ నేతలు ట్రాన్స్ఫర్ చేయించారు. తిరుపతి జిల్లాగా ఎస్పీ బాధ్యతలు స్వీకరించి నిజాయితీగా విధులు నిర్వహిస్తున్న ఎస్పీని ఎందుకు ట్రాన్స్ఫర్ చేయాల్సి వచ్చిందని ప్రశ్నించారు. విచ్చలవిడిగా దొంగ ఓట్లు నమోదు చేసుకున్నటకు ఎస్పీ అడ్డు వస్తారనే ట్రాన్స్ఫర్ చేయించారన్నారు. మాకు ఆమెపై పూర్తి నమ్మకం ఉందని రేపు రానున్న ఎలక్షన్లలో అధికార పార్టీ నేతల మాట ఎక్కడ వెనదోనని ముందుగా ట్రాన్స్ఫర్ చేపించారని, ఈ ట్రాన్స్ఫర్ ఆర్డర్ను తక్షణమే రద్దు చేయాలని సోమవారం టౌన్ క్లబ్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద టీడీపీ-జనసేన నేతలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు వారి నిరసనను అడ్డుకొని ఇరు పార్టీల నేతలను బలవంతంగా వెస్ట్ పోలీస్ స్టేషన్ కు తరలించి కొంతసేపటి తర్వాత విడిచిపెట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో టిడిపి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, ఉకా విజయ్ కుమార్, చిన్న బాబు, బాలసుబ్రమణ్యం, ముని కృష్ణ, రమణ, శాంతమ్మ, చపతి.. జనసేన నగర అధ్యక్షుడు రాజారెడ్డి, కొండా రాజమోహన్, దినేష్ జై, రాజేష్ ఆచారి, కిషోర్, రమేష్ నాయుడు, హేమంత్, పురుషోత్తం, ఆది, నవీన్, లిఖిత్, పవన్, కౌషిక్, బాలు మరియు ఇరు పార్టీల నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.