వారాహి యాత్ర దిగ్వజయంగా సాగాలి: బొలిశెట్టి శ్రీనివాస్

తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో శ్రీ దక్షిణముఖ సువర్చల అభయ ఆంజనేయస్వామి దేవాలయంలో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి కేశవభట్ల విజయ్, నియోజకవర్గం మీడియా ఇంచార్జ్ ముఖేష్, పెంటపాడు మండల ఉపాధ్యక్షులు కాజులూరు మల్లేష్ ఆధ్వర్యంలో మరియు వర్తనపల్లి కాశీ అధ్యక్షతన జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ప్రజా నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేపట్టబోయే వారాహి యాత్ర దిగ్వజయంగా సాగాలని ప్రజా శ్రేయస్సు కోసం ఆయన బుధవారం చేపట్టబోయే యాత్ర జయప్రదం అవ్వాలని ధర్మసంస్థాపనార్ధాయ సంభవామి యుగేయుగే అన్న భగవద్గీత శ్లోకం వాక్కు ప్రకారం ధర్మ రక్షణకై ప్రజా శ్రేయస్సుకై ఆకాంక్షిస్తూ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు జూన్ 14వ తేదీ నుండి చేపట్టబోయే వారాహి యాత్ర జయప్రదం అవ్వాలని అవుతుందని కోరుకుంటూ వైసీపీ ప్రభుత్వం చేసే కుట్రలు, కుతంత్రాలు పటా పంచలు అవ్వాలని ఆ శ్రీరామ భక్తుని ఆంజనేయ స్వామికి రాష్ట్ర నాయకులు తాడేపల్లిగూడెం జనసేన పార్టీ ఇంచార్జ్ ప్రజల మన్ననలను పొందిన వ్యక్తి బొలిశెట్టి శ్రీనివాస్ చేతుల మీదుగా స్వామి వారికి ప్రత్యేక పూజలు చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.