బాసురు గ్రామ జనసైనికులతో ఆత్మీయ సమావేశం

పాలకొండ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు గర్భన సత్తిబాబు ఆధ్వర్యంలో మంగళవారం పాలకొండ మండలం బాసురు గ్రామ జనసైనికులతో ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో గర్భన సత్తిబాబు మాట్లాడుతూ… పంట నష్టం వచ్చి ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులకు పవన్ కళ్యాణ్ లక్ష రూపాయల చొప్పున 3000 మంది కౌలు రైతులకు 30 కోట్లు సహాయం ప్రకటించడం జరిగింది. మొదటి రెండు మూడు విడతలలో భాగంగా… అనంతపురం, పశ్చిమగోదావరి, కర్నూలు, జిల్లాలో చనిపోయిన కౌలు రైతులకు పవన్ కళ్యాణ్ ఇస్తున్న ఆర్ధిక సహాయాన్ని గ్రామాల్లోని ప్రజలకు చేరువయ్యేలా జనసైనికులు బాధ్యత తీసుకోవాలని తెలియచేసారు. ఈ కార్యక్రమంలో గ్రామ జనసైనికులు పాల్గొన్నారు.