వ్యాక్సిన్ల సరఫరాకు స్పుత్నిక్‌ వీ అంగీకారం: కేజ్రీవాల్

రష్యా కొవిడ్‌ వ్యాక్సిన్‌ స్పుత్నిక్‌ వీ డోసులను ఢిల్లీకి సరఫరా చేసేందుకు తయారీదారులు అంగీకరించారని సీఎం అరవింద్‌ కేజ్రీవాల్ బుధవారం తెలిపారు. అయితే, ఎన్ని డోసులు సరఫరా చేస్తారన్న దానిపై నిర్ణయించలేదని పేర్కొన్నారు. ఈ మేరకు తయారీదారులతో చర్చలు జరుగుతున్నాయన్నారు. ఢిల్లీ అధికారులు టీకా తయారీదారులతో మంగళవారం సమావేశమయ్యారని చెప్పారు. మోడెర్నా, ఫైజర్‌ తయారు చేసిన వ్యాక్సిన్లు రెండు పిల్లలకు వేసేందుకు అనుకూలంగా ఉన్నాయని, వాటిని కేంద్ర ప్రభుత్వం సేకరించాలని కోరారు. ఇదిలా ఉండగా.. ఢిల్లీలో నగరంలో సుమారు 620 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. అయితే, చికిత్సలో ఉపయోగించే ఆంఫోటెరిసిన్‌-బీ ఇంజెక్షన్ల కొరత ఉందన్నారు.