8 గంటలు నిశీదిలో గడిపిన శ్రీలంక

సోమవారం శ్రీలంకలో విద్యుత్ సరఫరా లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. విద్యుత్ సరఫరాలో తలెత్తిన లోపం కారణంగా మొత్తం దేశమంతా విద్యుత్ సరఫరా ఆగిపోయింది. ఈ మేరకు దేశం మొత్తం 7-8 గంటల సేపు అందకారంలో గడపాల్సి వచ్చింది. శ్రీలంక రాజధాని కొలంబో కు వెలుపల ఉన్న కేరవాలాపిటి విద్యుత్ కాంప్లెక్స్ లో సాంకేతిక సమస్య కారణంగా సరఫరా ఆగిపోయింది. విద్యుత్ సరఫరా పునరుద్ధరించదానికి దాదాపు 7-8 గంటల సమయం పట్టింది. మొత్తం దేశమంతా విద్యుత్ సరఫరా ఆగిపోయింది. ఇలాంటిదే ఘటన గతంలో అంటే 2016లో ఓసారి జరిగినట్టు ప్రజలు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అప్పుడు మొత్తం దేశంలో 8 గంటల పాటు విద్యుత్ సరఫరా ఆగిపోయింది.