శ్రీ శివశంకర్ మాస్టర్ ఆత్మకు శాంతి చేకూరాలి

ప్రముఖ సినీ నృత్య దర్శకులు శ్రీ శివశంకర్ మాస్టర్ కన్ను మూయడం బాధాకరం. కోవిడ్ మూలంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.. కోలుకుంటారు అని భావించాను. శ్రీ శివశంకర్ మాస్టర్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. శాస్త్రీయ నృత్యంలో పట్టు ఉన్న ఆయన సినీ నృత్యంలో ఆ పరిజ్ఞానాన్ని మేళవించారు. ప్రేక్షకులను మెప్పించారు. రామ్ చరణ్ సినిమా మగధీరలో శ్రీ శివశంకర్ మాస్టర్ నృత్యరీతులు అందించిన పాట ప్రేక్షకులకు సంతోషాన్ని ఇవ్వడమే కాకుండా జాతీయస్థాయి పురస్కారాన్ని పొందింది. వందల చిత్రాల్లోని పాటలకు తన కళ ద్వారా నృత్యరీతులు అందించిన శ్రీ శివశంకర్ మాస్టర్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను అని జనసేనాని పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో తెలిపారు.