శ్రీకాళహస్తి జనసేన ఇంచార్జ్ శ్రీమతి వినుత కోటా అరెస్టు
శ్రీకాళహస్తి నియోజకవర్గం: శ్రీకాళహస్తి జనసేన ఇంఛార్జి శ్రీమతి వినుత కోటాను ఆదివారం పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి శ్రీకాళహస్తి 2 టౌన్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. వారి ఇంటికి వచ్చిన నాయకులు, కార్యకర్తలను ఇంట్లోకి రానివ్వకుండా అడ్డుకుని ఇంఛార్జి వినుత కోటా భర్త కోటా చంద్రబాబును, నాయకులు, జనసైనికులను అక్రమంగా అరెస్టు చేసి స్టేషన్ కి తరలించడం జరిగింది. జనసేన పార్టీ ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా మరియు నాయకులు పోలీసుల వైఖరిని నిరసిస్తూ పోలీస్ స్టేషన్లో కూర్చుని నల్ల రిబ్బన్ కట్టుకుని నిరసన తెలిపారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-10-at-8.11.25-PM-1-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-10-at-8.11.26-PM-2-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-10-at-8.11.29-PM-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-10-at-8.11.29-PM-1-1024x576.jpeg)