రోడ్ల దుస్థితిపై శ్రీకాళహస్తి జనసేన వినూత్న నిరసన

జనసేన అధినేత ప వన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు.. ఆదివారం శ్రీకాళహస్తి నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి పై డిజిటల్ ప్రచారంలో భాగంగా శ్రీకాళహస్తి నియోజకవర్గం, తొట్టంబేడు పంచాయతీకి చెందిన చెన్నై రోడ్డు నుండి మయూరి టవర్స్ కి వెళ్ళు రోడ్డు పరిస్థితి పై సీఎం జగన్ రెడ్డి గారి వేషంలో నిద్రలో ఉన్న జగన్ గారిని మేల్కొలిపే రీతిలో వినూత్నంగా నిరసన కార్యక్రమం నిర్వహించిన నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జి శ్రీమతి వినుత కోటా మరియు నాయకులు, జనసైనికులు.