ఏళ్ళ తరబడి రోడ్డులేక అవస్థలు పడుతున్న పెందూరు గ్రామవాసులు

#GoodMorningCMSir

కృష్ణాజిల్లా, పెడన నియోజకవర్గం, బంటుమిల్లి మండలం, పెందూరు గ్రామంలో కొన్ని సంవత్సరాల నుండి రోడ్డు సౌకర్యం లేక గ్రామస్తులు అవస్థలు పడుతున్నారు. పెందూరు గ్రామం నుండి దళితవాడికి వెళ్లే రోడ్డు అస్తవ్యస్తంగా బురద మయంగా ఉంది.

గత ప్రభుత్వంలో కోటి 70 లక్షలు గ్రాంట్ ఈ రోడ్డుకి శాంక్షన్ అయిందని కానీ రోడ్డు మాత్రం వేయలేదని గ్రామ ప్రజలు చెప్తున్నారు. వైసిపి ప్రభుత్వం కోటి యాభై లక్షలు గ్రాండ్ మంజూర అయిందని కానీ రోడ్డు మాత్రం వేయలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రోడ్లు ప్రయాణానికి అనుకూలంగా లేని కారణంగా విద్యార్థులు, వృద్ధులు మహిళలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

వైసిపి ప్రభుత్వం, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రోడ్లను వేయించవలసిందిగా జనసేన పార్టీ తరపున డిమాండ్ చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు ఎస్ వి బాబు, బంటుమిల్లి మండల అధ్యక్షులు ర్యాలీ సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు దాసరి నాంచారయ్య, గొట్రు రవి కిరణ్, జన్యావుల నాగబాబు, అర్జ ఉమా శంకర్, యలవర్తి ఆంజనేయులు, పుప్పాల సూర్యనారాయణ, పుప్పాల ఏసు, శీరం సంతోష్, ముద్దినేని రామకృష్ణ, చిటికెనేని రవితేజ, ఊస వెంకయ్య, దాసరి నాని, పినిశెట్టి రాజు మరియు జనసైనికులు పాల్గొన్నారు.