భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌కు నివాళులు అర్పించిన శ్రీకాంత్ రెడ్డి

భారత రాజ్యాంగ రూపకర్త, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అలుపెరగని కృషి చేసిన మహానుభావుడు డాక్టర్‌ బి.ఆర్ అంబేద్కర్

అనంతపురం అర్బన్ ఇంచార్జ్ మరియు జిల్లా అధ్యక్షులు టి.సి.వరుణ్ ఆదేశాల మేరకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో భారతరత్న, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 66వ వర్ధంతి సందర్భంగా ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ… మంగళవారం నగరంలోనీ స్థానిక డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘననివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా నగర అధ్యక్షులు పొదిలి బాబురావు, జిల్లా ఉపాధ్యక్షులు అంకె ఈశ్వరయ్య మాట్లాడుతూ ప్రజా జీవితంలో ఒక మహోన్నత నేత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, భారతీయుల గుండెల్లో చిరస్మరణీయుడనీ, ఆయన “భారతరత్న” భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని గుర్తు చేశారు. ఆయన బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం చేసిన కృషిని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ ఆయన బాటలో నడిచి ఆయన ఉన్నత ఆశయాల నెరవేర్పు కై ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా వారికి జనసేన పార్టీ తరఫున ఘన నివాళులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కిరణ్ కుమార్, నగర ప్రధాన కార్యదర్శిలు మేదర వెంకటేష్, హుస్సేన్, దరాజ్ భాష, నగర కార్యదర్శిలు విశ్వనాథ్, సంపత్, శేషాద్రి, సంయుక్త కార్యదర్శులు ఆకుల అశోక్, పవన్, మంగళ కృష్ణ, నాయకులు చరణ్, నజీమ్, నౌషాద్, అశోక్, మల్లి తదితరులు పాల్గొనడం జరిగింది.