పోలీసుల కస్టడీకి బిట్టు శ్రీను

మంథని: న్యాయవాద దంపతుల హత్య కేసులో నాల్గో నిందితుడు బిట్టు శ్రీనుని పోలీసుల కస్టడీకి మంథని న్యాయస్థానం అనుమతించింది. శ్రీనుని కస్టడీకి పంపాలంటూ పోలీసులు పిటిషన్‌ దాఖలు చేయడంతో కోర్టు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కుంట శ్రీనుతో పాటు మరో ఇద్దరు పోలీసుల అదుపులో ఉన్న విషయం విధితమే. ఇప్పుడు బిట్టు శ్రీనుతో కలుపుకుని నలుగురినీ విచారించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి మరిన్ని విషయాలు తెలిసే అవకాశముంది.