SSC CHSL నోటిఫికేషన్

కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఎల్డీసీ, జేఎస్ఏ, పీఏ వంటి పోస్టుల భర్తీకి కంబైండ్ హయ్యర్ సెకండరీ లెవల్ (CHSL) నోటిఫికేషన్‌ను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) విడుదల చేసింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. వచ్చేనెల 15 వరకు దరఖాస్తులు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయని తెలిపింది. భర్తీ ప్రక్రియ మూడు దశల్లో ఉంటుందని వెల్లడించింది. మొదటి దశలో (టైర్‌-1) ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలు, రెండో దశ (టైర్‌-2)లో పెన్‌పేపర్ (వ్యాసరూప ప్రశ్నలు) పరీక్ష, మూడోదశలో స్కిల్ టెస్ట్ ఉంటుంది. అయితే మొత్తం పోస్టులను వెల్లడించలేదు. కాగా, గతేడాది 4,893 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రస్తుతం ఆ ప్రక్రియ కొనసాగుతున్నది. ఈ ఏడాది కూడా అంతే మొత్తంలో పోస్టులు ఉండే అవకాశం ఉన్నదని సమాచారం. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://ssc.nic.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

పోస్టుల వివరాలు: లోయర్ డివిజనల్ క్లర్క్-LDC, జూనియర్ సెక్రెటేరియట్ అసిస్టెంట్-JSA, పోస్టల్ అసిస్టెంట్-PA, సార్టింగ్ అసిస్టెంట్-SA, డేటా ఎంట్రీ ఆపరేటర్-DEO

విద్యార్హత- డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుకు సైన్స్, మ్యాథ్స్ సబ్జెక్ట్‌తో ఇంటర్ లేదా 12వ తరగతి పాస్ కావాలి. ఇతర పోస్టులకు ఇంటర్మీడియట్ లేదా 10+2 పాస్ కావాలి.

వయస్సు- 2021 జనవరి 1 నాటికి 18 నుంచి 27 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం- కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, టైర్ 2 ఎగ్జామ్, టైపింగ్ టెస్ట్ లేదా స్కిల్ టెస్ట్.

టైర్‌-1.. కంప్యూటర్ ఆధారిత పరీక్ష. ఇందులో ఇంగ్లిష్ లాంగ్వేజ్‌, జనరల్ ఇంటెలిజెన్స్‌, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, జనరల్ అవేర్‌నెస్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. ప్రతి సబ్జెక్టులో 25 ప్రశ్నల చొప్పున 50 మార్కులకు ఉంటాయి. మొత్తం 200 మార్కులకు పరీక్ష ఉంటుంది. గంటలో పరీక్ష రాయాలి.

టైర్‌-2.. వ్యాసరూప ప్రశ్నలు. ఇందులో ఎస్సే రైటింగ్ (200 నుంచి 250 పదాల్లో రాయాలి), లెటర్ రైంటింగ్ ఉంటాయి. మొత్తం 100 మార్కులు.

టైర్‌-3.. స్కిల్ టెస్ట్. హిందీ, ఇంగ్లిష్‌లో టైపింగ్ పరీక్ష ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో

అప్లికేషన్ ఫీజు: రూ.100

దరఖాస్తులకు చివరితేదీ: డిసెంబర్ 15

ఆన్‌లైన్ ఫీజు చెల్లింపులకు చివరితేదీ: డిసెంబర్ 17

టైర్‌-1 పరీక్ష: 2021, ఏప్రిల్ 12 నుంచి 27 వరకు

ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను వెబ్‌సైట్‌ https://ssc.nic.in/