9,640 ఉద్యోగాలకు దరఖాస్తు గడువు పెంపు

దేశంలోని నిరుద్యోగులు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాల కోసం ఆశగా ఎదురుచూసే వారికి ఐబీపీఎస్ శుభవార్త చెప్పింది. గ్రామీణ బ్యాంకుల్లో 9640 ఉద్యోగాలకు గత నెలలలోనే గడువు ముగియగా మరోసారి వాళ్లకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. ఐబీపీఎస్ నిర్ణయం వల్ల దరఖాస్తు చేసుకోని వారికి ప్రయోజనం కలగనుంది.

https://ibps.in/ ద్వారా అభ్యర్థులు నవంబర్ నెల 9వ తేదీ వరకు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 9,640 ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఎంపికైన అభ్యర్థులు దేశంలోని 43 గ్రామీణ బ్యాంకులలో పని చేయాల్సి ఉంటుంది. తెలుగు రాష్ట్రాల వివరాలను పరిశీలిస్తే తెలంగాణలో 470 ఖాళీలు ఉండగా ఏపీలో 366 ఖాళీలు ఉన్నాయి. మొత్తం 5 ఆర్ఆర్‌బీల్లో 836 పోస్టులు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి.

9,640 ఉద్యోగాలలో ఆఫీస్ అసిస్టెంట్‌(మల్టీపర్పస్‌) ఉద్యోగాలు 4,624, ఆఫీసర్‌(అసిస్టెంట్ మేనేజర్‌) – 3,800 ఉద్యోగాలు, జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ 837 ఉద్యోగాలు, ఆఫీసర్‌ (స్కేల్‌-3) 156 ఉద్యోగాలు, అగ్రికల్చర్ ఆఫీసర్ 100 ఉద్యోగాలు, ఐటీ ఆఫీసర్ 58 ఉద్యోగాలు, లా ఆఫీసర్ 26 , మార్కెటింగ్ ఆఫీసర్‌ 8, ట్రెజరీ మేనేజర్ 3 ఉద్యోగాలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలలో కొన్ని ఉద్యోగాలకు బ్యాచిలర్ డిగ్రీ, కొన్ని ఉద్యోగాలకు సీఏ అర్హతగా ఉంది.

రాత పరీక్షలో వచ్చిన మార్కుల ద్వారా ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్) ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా స్కేల్ 1 ఆఫీసర్ల భర్తీ జరుగుతుంది. ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేయాల్సి ఉండగా ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీలకు 175 రూపాయలు, మిగిలిన వారికి 850 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఆఫీసర్‌ పోస్టులకు 2020 డిసెంబర్ 31న, ఆఫీసర్‌ అసిస్టెంట్‌ పోస్టులకు 2021 సంవత్సరం జనవరి 2,4 తేదీలలో పరీక్షలు జరుగుతాయి.