తడిసిన ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు కొనాలి: రాజోలు జనసేన

రాజోలు, అకాల వర్షాల వల్ల నష్టపోతున్నటువంటి రైతాంగానికి బాసటగా నిలబడే విధంగా క్షేత్రస్థాయి పర్యటనలు చేయాల్సిందిగా జనసేనాని పవన్ కళ్యాణ్, పిఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్, జిల్లా అద్యక్షులు కందుల దుర్గేష్ ఆదేశాల మేరకు బుధవారం రాజోలు నియోజకవర్గంలో మామిడికుదురు మండలం గెద్దాడ బైపాస్ రోడ్ లో దెబ్బతిన్న పంటలను పరిశీలించి, రైతుల సమస్యలు తెలుసుకుని తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతు మద్దతు ధరకే కోనుగోలు చెయ్యాలని, ఇంకా కోత దశలో ఉన్నా గానీ టార్గెట్ అయిపోయిందని రైతులను భయాందోనల కలిగించే విధంగా ప్రభుత్వం వ్యహరిస్తుంది అని, ఈ క్రాప్ లో నోట్ అయిన మొత్తం పంటను కోనుగోలు చెయ్యాలని రైతుల తరఫున ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే విధంగా ఈ కార్యక్రమం చేపట్టటం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ నాయకులు, మండల, గ్రామ స్థాయి నాయకులు సర్పంచ్ లు, ఎంపీటీసీలు, క్రియాశీలక సభ్యులు, క్రియా వాలంటీర్ లు, జనసేన నాయకులు, జనసైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.