98 కిలోల బరువు తగ్గిన స్టార్‌ కొరియోగ్రాఫర్‌ గణేశ్‌ ఆచార్య

ప్రముఖ కొరియోగ్రాఫర్‌ గణేశ్‌ ఆచార్యను ఇప్పుడు చూస్తే షాక్‌ అవుతారు ఎందుకంటే.. ఒకప్పుడు రెండు వందల కిలోలుండే గణేశ్‌ ఆచార్య ఇప్పుడు సన్నబడ్డారు. రీసెంట్‌గా జరిగిన కపిల్‌ శర్మ షోలో కొరియో గ్రాఫర్స్‌ గీతాకపూర్‌, లూయిస్‌తో కలిసి గణేశ్‌ ఆచార్య పాల్గొన్నారు. గణేశ్‌ ఆచార్య లుక్‌ చూసి అక్కడున్న ప్రేక్షకులే కాదు, షోకు వ్యాఖ్యాతగా వ్యవహరించే కపిల్‌ శర్మ కూడా షాకయ్యారు. ‘అసలు మీరెన్ని కిలోలు బరువు తగ్గారు’ అని కపిల్‌ శర్మ అడగ్గా ‘ఓ 98 కిలోలు ‘ తగ్గాను అని గణేశ్‌ ఆచార్య తెలిపారు. ‘అంటే దాదాపు చిన్న చిన్న పట్టణాల్లో ఇద్దరు వ్యక్తులను చంపేశారుగా’ అని కపిల్ శర్మ గణేశ్‌ ఆచార్యను ఆటపట్టించారు. ఈ కపిల్‌ శర్మకు సంబంధించిన వీడియో ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది.