డిగ్రీ అర్హతతో 200 ఉద్యోగాలు.. గడువు మరో రెండు రోజులే..

ఏపీ స్కిల్ డవల్మపెంట్ కార్పొరేషన్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. తాజాగా APSSDC ఆధ్వర్యంలో HETERO DRUGS సంస్థలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ప్రస్తుతం 200 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. ఇందుకోసం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఈ నెల 18ని గడువుగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. కేవలం పురుషులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

వయస్సు: 27 ఏళ్ల లోపు ఉండాలి.

అర్హత: పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు బీఎస్సీ(కెమిస్ట్రీ) పూర్తి చేసి ఉండాలి. 2016, 2017, 2018, 2019, 2020లో పాసైన వారు దరఖాస్తుకు అర్హులు.

వేతనం: ఎంపికైన అభ్యర్థులకు రూ. 11 వేల వరకు వేతనం ఉంటుంది. దీంతో పాటు ప్రొడక్షన్ అలవెన్స్ కింద రూ. 500, Production Expence కింద రూ.2 వేలు, నైట్ ఫిఫ్ట్ అలవెన్స్ రూ.2 వేలు, బోనస్ గా రూ.16800 చెల్లించనున్నారు.

అభ్యర్థులు మొదట APSSDC వెబ్ సైట్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

జిల్లా స్కిల్ డవలప్మెంట్ ఆఫీసర్ ఆధ్యర్యంలో అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

ఎంపికైన అభ్యర్థులకు టెక్నికల్, సాఫ్ట్ స్కిల్స్ పై నెల పాటు శిక్షణ అందిస్తారు

శిక్షణ విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులకు హెటిరో డ్రగ్స్ కంపెనీలో ఉద్యోగం కల్పించబడుతుంది. ఇతర వివరాలకు 9494791935 నంబరుకు ఫోన్ చేయవచ్చు.

Registration-Direct Link