5న రాష్ట్రబంద్‌ పోస్టర్‌ విడుదల

విజయవాడ: విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం 5న తలపెట్టిన రాష్ట్ర బంద్‌ను జయప్రదం చేయాలని వామపక్ష నేతలు పిలుపునిచ్చారు. బుధవారం ఉదయం విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం (ఎంబివికె)లో నిర్వహించిన కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు పోస్టర్‌ను విడుదల చేశారు. పోరాటాల ద్వారా విశాఖ ఉక్కును సాధించుకుంటే… కేంద్రం ఏకపక్షంగా ప్రైవేటీకరణకు పాల్పడిందని విమర్శించారు. ఈ చర్యకు నిరసనగా ఈ నెల 5న రాష్ట్ర బంద్‌ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ నటుడు ఆర్‌ నారాయణ మూర్తి, మాజీ ఎమ్మెల్సీ జెల్లీ విల్సన్‌, సిపిఎం రాష్ట్రకార్యదర్శి వర్గ సభ్యులు వై వెంకటేశ్వర రావు, సిపిఐ ఎం ఎల్‌ న్యూ డెమోక్రసీ నాయకులు పి ప్రసాద్‌, పొలారి, ఫార్వార్డ్‌ బ్లాక్‌ నాయకులు పీవీఎస్‌ రామరాజు, ఎస్‌యుసిఐ నాయకులు అమరనాథ్‌, సిపిఐ ఎం ఎల్‌ లిబరేషన్‌ నాయకులు హరినాథ్‌ తదితరులు పాల్గన్నారు.