వారాహి యాత్రను దమ్ముంటే ఆపండి: చిర్రి బాలరాజు

భీమవరంలో ఆదివారం ఉమ్మడి పశ్చిమ గోదావరీ అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు ఏర్పాటు చేసిన ఇంచార్జ్స్ అత్యవసర సమావేశంలో పోలవరం నియోజకవర్గం ఇంచార్జి చిర్రి బాలరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం సాయి, జిల్లా కార్యదర్శి గడ్డమణుగు రవికుమార్ పాల్గొన్నారు. 20 రోజులు పాటు భారీ సమావేశాలు, ర్యాలీలు నిర్వహించకూదని పోలీస్ సెక్షన్ 30 అమలులోకి తీసుకువస్తున్నట్లు ఇటీవల డి.ఎస్.పి అంబికా ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేసారు. జూన్ 14న మొదలు కాబోతున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి వారహి యాత్రకు వైసీపీ ప్రభుత్వం అడ్డు గోడ కట్టే ప్రయత్నం చేస్తుందని, అరచేతిలో అగ్నిని దాచాలని అనుకోవడం హాస్యాస్పదమని, ప్రభుత్వం చేసే మోసాలను పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ బయట పెడతారనే భయంతోనే పోలీస్ డిపార్ట్మెంట్ ను అడ్డం పెట్టుకుని ఈ పనులు చేస్తుందని, ఎవరు ఎన్ని అడ్డంకులు వేసినా, ఎన్ని జీవోలు తెచ్చినా ఒక్క జనసైనుకుడిని కూడా ఆపలేరని, మా నాయకుడు యాత్రకి వస్తుంటేనే ప్రభుత్వానికి వెన్నులో వణుకు పుడుతుందని, మా నాయకులు యాత్ర చేస్తారు దమ్ముంటే ఆపండి అని పోలవరం ఇంచార్జి చిర్రి బాలరాజు సవాల్ చేసారు.