విగ్రహం ధ్వంసం చేసిన దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలి

ఇచ్ఛాపురం ఇన్నేసుపేట గ్రామంలో ఏర్పాటు చేసినటు వంటి మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ ఘటనపై ఇచ్ఛాపురం నియోజకవర్గ జనసేన సమన్వయ కర్త దాసరి రాజు ఘటన జరిగిన ప్రదేశాన్ని పర్యవేక్షించి స్వతంత్ర సమరయోధుడు అయిన అల్లూరి సీతారామరాజు విగ్రహం ధ్వంసం ఘటన చాలా దురదృష్టకరమని ఆంధ్రప్రదేశ్లో కొద్ది రోజుల క్రితం దేవతా మూర్తుల విగ్రహాల ధ్వంసం జరిగినపుడు ఆ దోషులను పట్టుకొని కఠిన చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వలన నేడు దేశ నాయకుల విగ్రహాలు ధ్వంసం చేయడానికి దుండగులు పూనుకున్నారని ఇలాంటి ఘటనలను తీవ్రంగా ఖండిస్తూ, అల్లూరి విగ్రహం ధ్వంసం చేసిన దుండగులను వెంటనే పట్టుకొని కఠినచర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ తరపున డిమాండ్ చేశారు. ఘటనా స్థలిని పర్యవేక్షించిన వారిలో జనసేన రాష్ట్ర జాయింట్ సెక్రటరీ తిప్పన దుర్యోధన రెడ్డి, రోకళ్ళ భాస్కర్, మురళి, హరి, రామకృష్ణ తదితరులు ఉన్నారు.