మధ్యపాన నియంత్రణ కఠినంగా అమలుచేయాలి: అదాడ

*రాష్ట్రంలో మధ్యపానాన్ని నియంత్రించాలని లోక్సత్తా పార్టీ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహణ

*అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు హాజరు

*జనసేన తరుపున పాల్గున్న నాయకులు ఆదాడ మోహనరావు, త్యాడ రామకృష్ణారావు(బాలు)

విజయనగరం: లోక్ సత్తా రాష్ట్ర అధ్యక్షలు బీశెట్టి బాబ్జి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో కట్టిన మద్య నియంత్రణ అమలు చేయాలని అన్ని జిల్లాల్లో సమావేశాలు నిర్వహణలో భాగంగా ఆదివారం ఉదయం విజయనగరంలో.. స్థానిక గురజాడ స్కూల్లో అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సమావేశనికి లోక్ సత్తా ఆహ్వానం మేరకు.. జనసేన తరుపున పార్టీ సీనియర్ నాయకులు ఆదాడ మోహనరావు మరియు త్యాడ రామకృష్ణారావు(బాలు) పాల్గొనడం జరిగింది.

ఈ సమావేశంలో నాయకులు ఆదాడ మోహనరావు మాట్లాడుతూ మేధావులను, సైనుకులను, విద్యావంతులను తయారు చేసిన దేశాలను, రాష్ట్రాలను చూసాంగాని, తాగుబోతులను తయారు చేసే రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ అని, దాని ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డీకే చెల్లిందని అన్నారు. ఎన్నికలకు ముందు పూర్తిగా మధ్యాన్ని నిషేధిస్థానని నమ్మబలికి తీరా అధికారం వచ్చాక విచ్చిలవిడిగా మధ్యాన్ని వాడవాడలా విస్తరించి, ఎక్కడా వినని పేర్లతో కల్తీ మధ్యంతో ప్రజల ప్రణాలతో చెలగాటం ఈ ప్రభుత్వం ఆడుతుందని ఆరోపించారు. గాంధీ జయంతి రోజునే మద్యంపై కొత్తపాలసీలు తెచ్చిన ఘనత రాష్ట్ర తాగుబోతుల సంఘం అధ్యక్షులు జగన్మోహన్ రెడ్దిదని దుయ్యబట్టారు.

మరో నాయకులు బాలు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలను తాగుబోతులుగా చూపించి మూడువేల ఎనిమిది వందలకోట్లు అప్పుగా తెచ్చుకున్నారని, ఖచ్చితంగా రాష్ట్రలో మధ్యంను నియంత్రంచించాలని.. మధ్యం నియంత్రణకు కొన్ని సూచనలు చేయడం జరిగింది.

1) విచ్చలవిడిగా మద్యంఅమ్మకాలు రద్దు చెయ్యాలి 2 )బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తే చర్యలు తీసుకోవాలి. 3)స్థానిక ప్రజాప్రతినిధులు కు మద్యం షాపులు నియంత్రణ చేసే అధికారం ఉండాలి 4)బెల్ట్ షాపులు కల్తీ మద్యం రద్దు చేయాలి 5)ప్రతి మండల కేంద్రం లో ఒక డి -ఎడిక్షన్ సెంటర్ ఏర్పాటు చేయాలి 6) చిన్న వయస్సు పిల్లలకు మద్యం విక్రయం చేయకూడదని తెలిపారు.