గన్నవరం విమానాశ్రయంలో నేటినుంచి కఠిన ఆంక్షలు…

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఏపీలో కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. తాజాగా మరికొన్ని ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఈరోజు నుంచి ఆంధ్రప్రదేశ్ లోని గన్నవరం ఎయిర్ పోర్ట్ లో ఆంక్షలను కఠినంగా అమలు చేయబోతున్నారు. ఎయిర్ పోర్ట్ ఆవరణలోకి ప్రయాణికులకు మాత్రమే అనుమతి ఇస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ప్రయాణికుడితో పాటుగా డ్రైవర్ కు మాత్రమే ఎయిర్ పోర్ట్ ఆవరణలోకి అనుమతి ఉంటుంది. వీడ్కోలు పలికేందుకు వచ్చే బంధువులను ప్రాధాన ద్వారం వద్దే నిలిపివేయనున్నారు. ఇక ఇప్పటి వరకు విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు మాత్రమే కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తుండగా, ఇకపై దేశీయ ప్రయాణికులకు కూడా ఎయిర్ పోర్ట్ లో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలనీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. పాజిటివ్ వచ్చిన ప్రయాణికులను అక్కడి నుంచి క్వారంటైన్ కు తరలించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.