కూతురుకు స్పెషల్‌ గిఫ్ట్‌ ఇచ్చిన స్టైలిష్‌ స్టార్‌

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కూతురు అల్లు అర్హ పుట్టిన రోజు ఈ రోజు. ఈ సందర్భంగాబన్నీ తన కూతురుకి అరుదైన గిఫ్ట్‌ ఇచ్చాడు. క్లాసిక్‌ మూవీ “అంజలి” సినిమాలోకి “అంజలి.. అంజలి ” అనే పాటను రీ క్రియేట్‌ చేసి.. వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. మణిరత్నం దర్శకత్వంలో మ్యాస్ట్రో ఇళయరాజా సంగీత సారథ్యం వహించిన “అంజలి ” సినిమాలో బేబీ షామిలి తన అభినయంతో అందరినీ కట్టిపడేసిన సంగతి విదితమే. ఈ సినిమాలోని టైటిల్‌ సాంగ్‌ని ఇప్పుడు అల్లు అర్హతో మళ్లీ రీ క్రియేట్‌ చేయగా.. క్యూట్‌ క్యూట్‌ ఎక్స్‌ ప్రెషన్స్‌తో అల్లు అర్హ నటించి అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ పాటతో అల్లు అర్హ తో పాటు ఆమె సోదరుడు అల్లు అయాన్‌, తాతయ్యలు అల్లు అరవింద్‌, కేసీ శేఖర్‌ రెడ్డి సహా బన్నీ కూడా నటించడం విశేషం. నాన్‌ క్లాసిక్‌ సాంగ్‌కు ధీటుగా ఈ పాటను కలర్‌ ఫుల్‌గా రీ క్రియేట్‌ చేశారు. గణేశ్‌ స్వామి కొరియోగ్రఫీ చేసిన లేటెస్ట్ అంజలి వీడియో సాంగ్‌కు సూర్య సినిమాటో గ్రాఫర్‌గా వర్క్‌ చేశారు. ఇప్పుడు ఈ సాంగ్‌ సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతోంది.