సభ్యత్వ నమోదును విజయవంతం చేయండి: గంగారపు రామదాస్ చౌదరి

మదనపల్లి: ఫిబ్రవరి 10న ప్రారంభం కానున్న జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్‌ గంగారపు రామదాస్ చౌదరి పిలుపునిచ్చారు. సోమవారం జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సభ్యత్వ నమోదు వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రదాన కార్యదర్శి జంగాల శివరామ్ రాయల్, రాష్ట్ర చేనేత విభాగం ప్రదాన కార్యదర్శి అడపా సురేంద్ర, ఐటి విభాగం జగదీష్, రూరల్ అధ్యక్షులు గ్రానైట్ బాబు, చంద్రశేఖర్, కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా గత రెండు విడతల్లో సభ్యత్వ నమోదులో క్రియాశీలకంగా వ్యవహరించి అధిక సభ్యత్వాలు చేసిన వారిని అభినందించారు. ‌గంగారపు రామదాస్ చౌదరి మాట్లాడుతూ సభ్యత్వ నమోదులో పాల్గొన్న వాలంటీర్లకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అదే ఉత్సాహంతో ఈ నెల 10న మొదలై 28 వరకు జరిగే మూడో విడత సభ్యత్వ నమోదును కూడా జయప్రదం చేయాలని కోరారు. పార్టీ సభ్యుల ప్రమాద బీమా నిమిత్తం పవన్ కల్యాణ్ గతంలో పెద్ద మొత్తంలో విరాళమిచ్చారని, ఈసారి కూడా తన విరాళాన్ని ప్రకటిస్తానన్నారు. గతంలో సభ్యత్వం చేసుకున్న వారిని రెన్యూవల్ చేస్తూ కొత్తగా సభ్యత్వాలు చేయించాలని కోరారు. ‌