స్వాతంత్ర్య పోరాటంలో నేతాజీది కీలకపాత్ర: గాదె వెంకటేశ్వరరావు

భారతదేశాన్ని ఆక్రమించిన బ్రిటీష్ సామ్రాజ్యంపై నేతాజీ సుభాష్ చంద్రబోస్ సాగించిన పోరాటం అనర్గళం, అనితరసాధ్యమని జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు అన్నారు. ఆదివారం సుభాష్ చంద్రబోస్ 125 జయంతి సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘననివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గాదె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ భారత స్వాతంత్ర్య పోరాటంలో నేతాజీది కీలకపాత్ర అన్నారు. వ్యూహాత్మక ఎత్తుగడలతో బ్రిటీష్ వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తూ నేతాజీ సాగించిన పోరాటం నభూతో నభవిష్యత్ అన్నారు. నాకు మీ రక్తాన్ని ఇవ్వండి నేను మీకు స్వంతత్ర్యాన్ని తెప్పిస్తాను అంటూ దేశ యువతను స్వాతంత్రోద్యమం వైపు నడిపిన ప్రపంచం మెచ్చిన గొప్ప నాయకుడు నేతాజీ అంటూ కొనియాడారు. నేతాజీ అందించిన స్పూర్తితో నేటి యువత దేశాభివృద్ధికి తమవంతుగా నిస్వార్థ సేవలు అందించాలని యువతను గాదె వెంకటేశ్వరరావు కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కొప్పుల కిరణ్ , జనసేన నాయకులు ఆళ్ళ హరి , కోనేటి ప్రసాద్ , అలా కాసులు , కిషోర్ , శ్రీనివాస్ , నాని , కిరణ్ , హేమంత్ , శెట్టి శ్రీను తదితరులు పాల్గొన్నారు.