మే 1 నుంచి పది విద్యార్థులకు వేసవి సెలవులు

ప్రస్తుతం కోవిడ్‌ రెండవ దశ ఉద్ధృతంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో. పదవ తరగతి విద్యార్థులకు సిలబస్ పూర్తయిన నేపథ్యంలో. మే 1 నుంచి 31 వరకు వేసవి సెలవులను ప్రకటిస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. ఆయన కడపలో మీడియాతో మాట్లాడుతూ. జూన్ ఒకటవ తేదీ నుంచి టీచర్లు విధులకు హాజరవుతారని చెప్పారు. షెడ్యూల్ మేరకు జూన్ 7వ తేదీ నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభమౌతాయని అన్నారు. ఈనెల 30 కి జూనియర్ కళాశాలలకు, టెన్త్ క్లాస్ పిల్లలకు లాస్ట్ వర్కింగ్ డే అవుతుందన్నారు.