భ‌యపెడుతున్న ‘మంగళం శ్రీను’.. ‘పుష్ప’ సినిమా నుంచి సునీల్ పోస్టర్ విడుద‌ల‌

అల్లు అర్జున్ హీరోగా ద‌ర్శ‌కుడు సుకుమార్ రూపొందిస్తోన్న ‘పుష్ప’ సినిమా నుంచి సునీల్ పోస్టర్ విడుద‌లైంది. సినిమాలో సునీల్ ‘మంగళం శ్రీను’ అనే పాత్రలో న‌టించాడు. ఆయ‌న లుక్ మునుపెన్న‌డూ చూడ‌ని విధంగా చాలా ప్రత్యేకంగా ఉంది. ఎర్ర‌ని క‌ళ్లు, చేతికి ఉంగ‌రాల‌తో ఆయ‌న ఫోనులో మాట్లాడుతున్న‌ట్లు క‌న‌ప‌డుతోన్న తీరు అల‌రిస్తోంది.

భ‌యంక‌రంగా ఆయ‌న క‌న‌ప‌డుతోన్న తీరు చూస్తోంటే ఈ సినిమాలో సునీల్.. ఈ సినిమా ప్రతినాయకుడిగా ఫాహద్ ఫాజిల్ లా విల‌న్ పాత్ర‌లో న‌టిస్తున్నట్లు తెలుస్తోంది. విల‌న్ పాత్ర‌ల్లో న‌టించాల‌ని ఉంద‌ని గ‌తంలోనూ సునీల్ చాలా సార్లు చెప్పాడు.