మెహందీ వేడుకలో మెరిసిపోతున్న సునీత..

టాలీవుడ్‌ ప్రముఖ గాయని సునీత పెళ్ళి కూతురుగా ముస్తాబైంది. మరికొన్ని గంటల్లోనే ఈమె పెళ్లి పీటలెక్కబోతుంది. మీడియా బిజినెస్‌మెన్‌ రామ్‌ వీరపనేనితో కొన్ని రోజుల కింద నిశ్చితార్థం జరుపుకున్న ఈమె (జనవరి 9)న ఈ రోజు ఆయనతో కలిసి ఏడడుగులు నడవబోతుంది. ఈ క్రమంలోనే సునీత ఇంట మెహందీ వేడుక ఘనంగా జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. అందులో సునీత స్నేహితురాలు, పవన్ కళ్యాణ్ మాజీ భార్య, నటి రేణూ దేశాయ్‌తో పాటు సుమ కనకాల కూడా వచ్చారు. అక్కడే ఉండి సునీతను పెళ్లి కూతురును చేసారు. ఆమె మెహందీ వేడుకలో కనువిందు చేసారు. పెళ్లి సమయం దగ్గర పడటంతో అభిమానులు కూడా ఈమెకు పెళ్లి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.