వైభవంగా హరితేజ శ్రీమంతం వేడుక

సీరియల్‌ నటిగా కెరీర్‌ మొదలు పెట్టి సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది నటి హరితేజ. ఇక త్రివిక్రమ్‌ దర్శకత్వంలో వచ్చిన ‘అఆ’ సినిమాతో ఒక్కసారిగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది హరితేజ. ఈ సినిమాలో తన నటనతో విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. ఇక అనంతరం ‘బిగ్‌బాస్‌1’తో మరింత క్రేజ్‌ సంపాదించుకున్న హరితేజ వరుస సినిమాలు, షోలతో దూసుకెళుతోంది.

ఇదిలా ఉంటే హరితేజ ఓ పండంటి బిడ్డకు జన్మనివ్వనుంది. ఈ క్రమంలోనే తాజాగా కుటుంబ సభ్యులు హరితేజ శ్రీమంతాన్ని వేడుకగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కుటుంబసభ్యులతో పాటు అత్యంత సన్నిహితులు హాజరయ్యారు.