టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్‌

చెన్నై: ఐపీఎల్‌ 14వ సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మధ్య మరికాసేపట్లో మ్యాచ్‌ ఆరంభంకానుంది. టాస్‌ గెలిచిన సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ బౌలింగ్‌ ఎంచుకున్నాడు. సందీప్‌ శర్మ, మహ్మద్‌ నబీ స్థానంలో జేసన్‌ హోల్డర్‌, షాబాజ్‌ నదీమ్‌లను తుది జట్టులోకి తీసుకున్నట్లు వార్నర్‌ చెప్పాడు. మరోవైపు తమ టీమ్‌లోకి స్టార్‌ ఓపెనర్‌ దేవదత్‌ పడిక్కల్‌ వచ్చినట్లు బెంగళూరు సారథి విరాట్‌ కోహ్లీ తెలిపాడు.