పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి: జగ్గయ్యపేట జనసేన

కృష్ణా జిల్లా, జగ్గయ్యపేట నియోజకవర్గం పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని వత్సవాయి మండల జనసేన పార్టీ అధ్యక్షులు రేగండ్ల వెంకటరామయ్యా(గోవింద్) ఆధ్వర్యంలో వత్సవాయి మండలం తహసీల్దార్ కి వినతిపత్రం అందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాలనీ కొనుగోలు చేసిన ధాన్యంకు సంబందించిన డబ్బులు రైతుల ఖాతాల్లో వేయాలని అకాల వర్షాలు మరియు చీడ పురుగులు వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలని విత్తనాలు ఎరువుల ధరలను మరియు నాణ్యతను ప్రభుత్వం భాద్యత వహించి నియంత్రించాలని అదేవిదంగా మండలంలోని మిర్చి రైతులు బాగా నష్టపోయారని సుమారుగా ఎకరానికి నలభై క్వింటాలకు పైగా పండవలసిన మిర్చి పంట ఎర్రనల్లి మరియు నల్ల తామర రోగాల వ్యాప్తి ఉదృతంగా ఉండటం వలన రెండు మూడు క్వింటాలకే పరిమితం అయ్యిందని రైతులకు తప్పకుండ నష్టపరిహారం అందించాలని రైతులును ఆదుకోవలసిన భాద్యత ప్రభుత్వానికి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జొన్నల రామకోటేశ్వరరావు, తుడుము శైలజ, రవి, చల్లా నరసింహారావు, పవన్, మల్లికార్జునరావు, మహేష్, గోపీచంద్, కిషోర్, జానీ తదితరులు పాల్గొన్నారు.