జర్నలిస్టులకు అండగా ఉంటా: డాక్టర్ కందుల

విశాఖ దక్షిణం, జర్నలిస్టులు తన కుటుంబ సభ్యులు వంటి వారని వారికి ఏ సమస్య వచ్చినా తాను ముందు ఉండి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నానని విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన నాయకులు, 32 వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు అన్నారు. కొంతకాలంగా ఎవస్యులర్ నెక్రాసిస్ (ఆర్థో) వ్యాధితో బాధపడుతున్న వి టెలి న్యూస్ ఛానల్ రిపోర్టర్ నడిపిల్లి మోహన్ కృష్ణకు వైద్య ఖర్చుల నిమిత్తం ఐదు వేల రూపాయలను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ వి టెలి న్యూస్ ఛానల్ రిపోర్టర్ నడిపిల్లి మోహన్ కృష్ణకు వైద్య ఖర్చుల నిమిత్తం సహ జర్నలిస్టులు తనకు సమాచారం ఇచ్చిన వెంటనే తాను వెంటనే స్పందించి 5000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తానని ప్రకటించినట్లు చెప్పారు. ఇచ్చిన హామీ మేరకు తనువుంటే సహాయంగా తన ప్రకటించిన నగదు మొత్తాన్ని అందజేయడం జరిగిందని తెలిపారు. నిత్యం పని ఒత్తిడితో పనిచేసే జర్నలిస్టులు పలువురు అనారోగ్యాల పాలవుతున్నారని అన్నారు. ఏదైనాప్పటికీ ప్రభుత్వాలు జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉండాలని సూచించారు. మోహనకృష్ణ కు పూర్తి వైద్య ఖర్చులకయ్యే నగదు నిమిత్తం సహ జర్నలిస్టులు చేస్తున్న కృషి అమోఘమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వి టెలి న్యూస్ ఛానల్ రిపోర్టర్ నడిపిల్లి మోహన్ కృష్ణ, సీనియర్ జర్నలిస్టులు ఈరోతి ఈశ్వరరావు, ఎం ఎస్ ఆర్ ప్రసాద్, మహేష్, దిలీప్ పాల్గొన్నారు.