విద్యుత్‌ ఉద్యోగుల విభజనపై సుప్రీంకోర్టు తీర్పు

విద్యుత్‌ ఉద్యోగుల విభజనపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ధర్మాధికారి కమిటీ ముగింపు నివేదికను సవాల్‌ చేస్తూ తెలంగాణ విద్యుత్‌ సంస్థలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. 584 మందిని అదనంగా కేటాయించారని ఏపీ ఉద్యోగులు, టీఎస్‌ జెన్‌కో, ట్రాన్స్‌కో, డిస్కంలు అభ్యంతరం తెలిపాయి. తెలంగాణ విద్యుత్‌ సంస్థల పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టేసింది. జస్టిస్‌ ధర్మాధికారి కమిటీ నివేదికను అమలు చేయాలని ధర్మాసనం ఆదేశించింది. జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌, జస్టిస్‌ ఎంఆర్‌ షా తీర్పును వెలువరించారు.