ఆస్కార్‌ తుదిబరిలో ‘సూరారై పొట్రు’

సూర్య నటించిన ఆకాశమే నీ హద్దు చిత్రం ఆస్కార్‌ తుది బరిలోకి చేరుకుంది. ఈ ఏడాది తుది అర్హత సాధించిన మొత్తం 366 చిత్రాల జాబితాను ఆస్కార్స్‌ అకాడమీ విడుదల చేసింది. అందులో దక్షిణ భారతదేశం నుంచి ఒక్క ‘సూరారై పొట్రు’ మాత్రమే తుదిపోటీలో స్థానం దక్కించుకుంది. ఆస్కార్‌ ఉత్తమ నటుడు, నటి విభాగాల్లో సూర్య, అపర్ణా బాల మురళీ కూడా అర్హత సాధించారు. మార్చి 5 నుంచి ఆస్కార్‌ అవార్డ్స్‌ ఓటింగ్‌ ప్రక్రియ ప్రారంభమవుతుంది.